కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి డిపో నుంచి మేడారం జాతరకు 58 బస్సులు నడుపుతున్నట్లు డీఎం ఇందిరాదేవి తెలిపారు. సోమవారం నుంచి 24 వరకు ఈ బస్సులు వెళ్తాయన్నారు. జాతరకు బస్సులు వెళ్తున్నందున కామారెడ్డి డిపో పరిధిలోని గ్రామాలకు బస్సు సర్వీసులు తగ్గిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్సహకరించాలని డీఎం ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంటికే మేడారం ప్రసాదం
టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ద్వారా మేడారం సమ్మక్క సారలమ్మ బంగారం ప్రసాదాన్ని ఇంటికే పంపిస్తామని కామారెడ్డి ఆర్టీసీ డీఎం ఇందిరాదేవి తెలిపారు. మేడారం జాతర ప్రసాదం పాంప్లెంట్స్ను ఆదివారం డీఎం రిలీజ్ చేశారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు రూ.299 చెల్లిస్తే ప్రసాదం ఇంటికే వస్తుందన్నారు. ప్రసాదం కోసం డిపో వద్ద సంప్రదించాలన్నారు. ఇన్సైడర్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చాన్నారు. అసిస్టెంట్ మేనేజర్లు లింగమూర్తి, వసుంధర, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రాజు పాల్గొన్నారు.