
కామారెడ్డిటౌన్, వెలుగు : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 58 ఫిర్యాదులు రాగా, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ విక్టర్ ఫిర్యాదుదారులతో మాట్లాడా వివరాలను సేకరించారు. జిల్లా, మండల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.
ఎల్ఆర్ఎస్, ధరణి సమస్యలపై తహసీల్దారులు, ప్రాపర్టీ టాక్స్, శానిటేషన్, నర్సరీలు, మొక్కల పెంపకంపై ఎంపీడీవో లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలకు సంబంధిత అధికారులు స్పందించాలని తెలిపారు.