పాకిస్తాన్ లో భూకంపం : మూడు నగరాల్లో ఊగిపోయిన బిల్డింగ్స్

పాకిస్తాన్ లో భూకంపం : మూడు నగరాల్లో ఊగిపోయిన బిల్డింగ్స్

పాకిస్తాన్ దేశాన్ని భూకంపం కుదిపేస్తుంది. 2024, సెప్టెంబర్ 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషాల సమయంలో ఈ భూ కంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.8గా నమోదైంది. లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్, మియాన్ వాలీ, బక్కర్ ప్రాంతాల్లో భూమి కంపించినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ దేశం ఉత్తర భాగంలోని చాలా ప్రాంతాలు భూకంపానికి ప్రభావితం అయ్యాయని అక్కడి మీడియా వెల్లడించింది. 

భూకంపం కేంద్రం పాకిస్తాన్ లోని కరోర్ ఏరియాకు నైరుతి దిశలో 25 కిలోమీటర్ల దూరంలో.. భూమికి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్మ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఆయా ప్రాంతాల్లో ఎలాంటి నష్టం జరిగింది.. ప్రాణ, ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా అనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు పాకిస్తాన్ ప్రభుత్వం.

పాకిస్తాన్ లోని భూకంప తీవ్రత.. భారతదేశంపై కూడా పడింది. ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఇది చాలా తక్కువ స్థాయిలో ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.