లక్నో: ఉత్తర్ప్రదేశ్లో నాల్గో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ విడతలో 9 జిల్లాల్లోని 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఫిలిబిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బండా, ఫతేపూర్ జిల్లాల్లో 624 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సవాయజ్పూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 15 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. పాలియా కలాన్, సేవటా సీట్లలో అతి తక్కువగా ఆరుగురు చొప్పున పోటీలో ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 59సీట్లలో 51 సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా.. సమాజ్వాదీ పార్టీ 4, బహుజన్ సమాజ్ పార్టీ 3, బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్ ఒక సీటు చొప్పున ఖాతాలో వేసుకున్నాయి.
అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్.. ఏడీఆర్ సర్వే ప్రకారం యూపీ నాల్గో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 27శాతం మంది నేర చరితులు ఉన్నారు. 37శాతం మంది కోటి రూపాయలకుపైగా ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఇక పార్టీల విషయానికొస్తే కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన 58 మందిలో 31 మంది, సమాజ్వాదీ పార్టీ 57లో 30, బహుజన్ సమాజ్ పార్టీ 59లో 26, బీజేపీ 57లో 23, ఆమ్ ఆద్మీ 45 లో 11 మంది నేర చరితులు బరిలో ఉన్నారు.
Lucknow | Polling parties and officials leave for their respective polling stations ahead of the fourth phase of #UttarPradeshElections2022 tomorrow.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 22, 2022
Voting will be held from 7 am to 6 pm. pic.twitter.com/nbFZvsTwUj