![మనిషి కడుపులో 59 అడుగుల పురుగు](https://static.v6velugu.com/uploads/2021/03/tapeworm.jpg)
ఓ వ్యక్తి కడుపులో నుంచి డాక్టర్లు ఏకంగా 59 అడుగుల పురుగును బయటకు తీశారు. దాని పొడవు చూసి డాక్టర్లు సైతం షాకయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. థాయ్‌ల్యాండ్‌లోని నాంగ్ ఖాయ్ ప్రావిన్స్‌లోని ఓ ఆసుపత్రికి 67 ఏళ్ల వృద్ధుడు కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చాడు. అతనికి పరీక్షలు చేసిన వైద్యులు.. అతడు టేప్‌వార్మ్ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దాంతో అతడికి నులిపురుగులను పోగొట్టే మందులను ఇచ్చారు. దాంతో వృద్దుడి కడుపులోంచి ఈ టేప్‌వార్మ్ బయటకొచ్చింది. టెస్టుల్లో వృద్దుడి కడుపులో ఏదో ఉందని.. దాన్ని బయటకు లాగారు. అయితే అది లాగే కొద్దీ వస్తుండడంతో డాక్టర్లకు మతిపోయింది. చివరకు మొత్తంగా 18 మీటర్ల పొడవున్న టేప్‌వార్మ్ అతడి కడుపులో నుంచి బయటకు తీశారు.