- ఉత్తర్వులు ఇచ్చిన మున్సిపల్ శాఖ
హైదరాబాద్ ,వెలుగు: హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ ఫర్ మేటివ్ ఇన్ ఫ్రాస్టక్చర్ ( హెచ్ సిటీ) ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.5,942 కోట్లు శాంక్షన్ అయ్యాయి. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు, అండర్పాస్ లు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈఈరూ. 758 కోట్లతో ఖైరతాబాద్ జోన్ లోని మెహిదీపట్నంలో ఒకటి, జూబ్లీహిల్స్ లో రెండు చోట్ల ఫ్లై ఓవర్ లు, అండ్ పాస్ లు, రోడ్డు విస్తరణ చేయనున్నారు.
రూ. 837 కోట్లతో శేరిలింగంపల్లి జోన్ లోని ఖాజాగూడ, త్రిపుల్ ఐటీ, విప్రో సర్కిల్ లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర, మియాపూర్ క్రాస్ రోడ్ దగ్గర నిర్మించనున్నారు. కూకుట్ పల్లి జోన్ లో ఫ్లై ఓవర్ లు, సికింద్రాబాద్ ఏవోసీ సెంటర్ లో రోడ్ల విస్తరణకు రూ. 960కోట్లు, ఎల్బీ నగర్ జోన్ లో టీకేఆర్ కాలేజ్ దగ్గర ఫ్లై ఓవర్ , చార్మినార్ జోన్ లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మించనున్నారు.