Realme:2025లో రూ.10వేల లోపు బెస్ట్ Realme స్మార్ట్ ఫోన్స్..వివరాలివిగో

Realme:2025లో రూ.10వేల లోపు బెస్ట్ Realme స్మార్ట్ ఫోన్స్..వివరాలివిగో

కొత్త సంవత్సరంలో స్మార్ట్ ఫోన్లు కొనాలనుకుంటున్నారా..? మీ బడ్జెట్ లో స్మార్మ్ట్ ఫోన్ కోసం కోరుకుంటున్నారా..తక్కువ ధరలో మంచి ఫీఛర్లు, అడ్వాన్స్ డ్ టెక్నాల జీతో డివైజ్ కొనాలనుకుంటున్నారా..అయితే మీకు ఇదే మంచి తరుణం.. 2025లో రూ. 10వేల లోపు ధరతో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. సరస మైన ధర, అద్బుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో కెమెరా, బెస్ట్ బ్యాటరీలతో 5 స్మార్ట్ ఫోన్లు మీకోసం..

Realme C61

Realme C61స్మార్ట్ ఫోన్  అతితక్కువ ధరలో మీ బడ్జెట్ లో అందుబాటులో ఉంది..ఈ డివైజ్ లో ఫీచర్ల గురించి మాట్లాడితే.. Unisoc Tiger T612 చిప్ సెట్ తో 6.78 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. బెస్ట్ కెమెరా సెటప్ ఉంటుంది.. మెయిన్ కెమెరా 32MP మెగాపిక్సెల్, ఆక్జిలరీ లెన్స్ లో అద్బుతంగా ఉంది. 5MP మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో లభిస్తోంది. దీంతో పాటు ఎక్కువ కాలం రన్ అయ్యే బ్యాటరీ దీని ప్రత్యేకత. ఇది 5000mAh సామర్థ్యంతో 10W ఛార్జింగ్ సపోర్టుతో పనిచేస్తుంది..  ఇది కేవంలం రూ. 7వేల 366 లు మాత్రమే.  

Realme Narzo N63

Realme Narzo N63ఈ స్మార్ట్ ఫోన్ ధర 9వేల లోపే ఉంది. ఈ డివైజ్ ప్రముఖ ఆన్ లైన్ ఈ కామర్స్ ప్లాట్ ఫాం ఫ్లిప్ కార్ట్ లో రూ.8,729 లకే లభిస్తోంది.ఇక ఈ డివైజ్ 6.75 అంగుళాల డిస్ ప్లే, 90Hz రీఫ్రెష్ రేట్, Unisoc Tiger T612 చిప్ సెట్ లో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. కెమెరా విషయానికి వస్తే  50MP మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆగ్జిలరీ లెన్స్, 8MP సెల్ఫీ కెమెరా, ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే మూడు రోజుల పాటు వచ్చే 5000mAh బ్యాటరీ ఉంది. ఇది బెస్ట్ బడ్జెట్ ఫోన్. 

Realme C53

Realme C53ఫీచర్లు విషయానికి వస్తే..6.74 అంగుళాల డిస్ ప్లే, Unisoc Tiger T612 చిప్ సెట్తో లభిస్తోంది. వైడ్ లెన్స్తో 50MP రియర్ కెమెరా,8MP  సింగిల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీతో మంచి బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో రూ. 9,999 లకు లభిస్తోంది. 

Realme C63

Realme C63.. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో రూ. 7,918 లకు అందుబాటులో ఉంది. ఈ డివైజ్ 6.7 అంగుళాల డిస్ ప్లే, Unisoc Tiger T612 chipset తో పనిచేస్తుంది. ఇందులో 50MP బ్యాక్ కెమెరా, ఆక్సిలరీ లెన్స్ , 8MP సింగిల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది 5000 mAh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. 

Realme Narzo N61

రియల్ మీ Narzo N61 స్మార్ట్ ఫోన్.. 6.74 అంగుళాల డిస్ ప్లే, 90Hz రీఫ్రెష్ రేటు, Unisoc Tiger T612 చిప్ తో రన్ అవుతుంది. ఈ డివైజ్ 5000mAh బ్యాటరీ ప్యాక్, 32MP మెగా పిక్సెల్ తో మెయిన్ కెమెరా, ఆగ్జిలరీ లెన్స్, 5MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.. ఇది అమెజాన్ లో ధర రూ. 7,499 లకు లభిస్తోంది.