వెలుగు : ఒప్పో రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ 5జీ సొల్యూషన్స్ మీద దృష్టి పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ తో పాటు, ఇండియా మార్కెట్ కు ప్రత్యేకంగా అవసరమైన 5జీ సొల్యూషన్స్‌ను హైదరాబాద్ సెంటర్లో అభివృద్ధిపరుస్తున్నట్లు చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఒప్పో ఉన్నతాధికారి చెప్పారు. రాబోయే రెండు, మూడేళ్లలో హైదరాబాద్ లోని ఉద్యోగుల సంఖ్యను ఇప్పుడున్న 150 నుంచి రెట్టింపు చేయనున్నట్లు ఒప్పో మొబైల్ ఇండియా ఆర్ అండ్ డీ హెడ్ తస్లీమ్ ఆరిఫ్ తెలిపారు. ఇండియా తమకు చాలా ముఖ్యమైన మార్కెట్టని, శరవేగంతో పెరుగుతోందని తెలిపారు. ఇండియాలోని వినియోగదారుల అవసరాలకు తగిన ఉత్పత్తు లు తయారు చేయడానికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పా రు. ఇందుకోసమే గత ఏడాది డిసెంబర్‌లో హైదరాబా ద్ లో ఆర్ అండ్ డీ సెంటర్ ప్రారంభించామన్నా రు.
ఇండియాలో 85 శాతం మంది వినియోగదారులు 250 డాలర్లలోపు ధరల మొబైల్ ఫోన్ లు వాడతారని, 5 శాతం మాత్రమే 500-–700 డాలర్ల మధ్య ధర మొబైల్స్ వినియోగిస్తా రని ఆరిఫ్ వెల్లడించారు. ఆయా విభాగాల వినియోగదారుల అవసరాలు వేరు వేరుగా ఉంటాయని పేర్కొన్నా రు. సర్వీస్ రంగంలోనూ ఇండియా అవసరాలు ప్రత్యేకమైనవేనని చెప్పా రు. డిజిటల్ ఇండియాను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన ఉత్పత్తు లను ఇక్కడ డెవలప్ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వంతో పాటు, ప్రైవేటు రంగంలోని వివిధ వర్గాలతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పా రు. నానాటికీ పెరుగుతున్న వ్యాపారంతో హైదరాబాద్ సెంటర్లోని ఉద్యోగుల సంఖ్యా పెరుగుతుందని, రాబోయే సంవత్సరాలలో ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశముందని తస్లీమ్ ఆరిఫ్ వెల్లడించారు.