
హైదరాబాద్, వెలుగు: తమ నెట్‌వర్క్ 5జీ ట్రయల్స్‌లో సెకెన్‌కు 3.7 జీబీ స్పీడ్‌ను అందుకుందని వొడాఫోన్ ఐడియా (వీ) ప్రకటించింది. దేశంలోని ఇతర టెలికం కంపెనీలతో పోలిస్తే ఇదే ఎక్కువని తెలిపింది. అప్పులతో సతమతమవుతున్న ఈ కంపెనీ పుణేలో 5జీ ట్రయల్స్ చేసింది. దేశంలో 5జీ నెట్‌వర్క్ ట్రయల్స్‌ను చేపట్టేందుకు వొడాఫోన్ ఐడియాకు 26 గిగాహెర్ట్జ్ (జీహెచ్‌జెడ్) ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్, 3.5 జీహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్ ) కేటాయించింది. ‘పుణేలోని క్లౌడ్ కోర్, ట్రాన్స్‌పోర్ట్ అండ్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ వంటి ఫెసిలిటీస్ ఉన్న ల్యాబ్‌లో 5జీ ట్రయల్స్‌ను జరిపాం. ఈ ట్రయల్‌లో మ్యాక్సిమమ్ స్పీడ్ సెకెనుకు 3.7 జీబీ అందుకున్నాం’ అని వీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. కాగా, 5జీ ట్రయల్స్‌లో సెకెన్‌కు ఒక జీబీ స్పీడ్‌ను అందుకున్నామని జియో, ఎయిర్‌టెల్ ఈ ఏడాది జులైలో ప్రకటించాయి.