
టెక్నాలజీ ప్రపంచంలో అత్యంత సంచలనాత్మక స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణలలో 2025 ఒకటిగా ఉండబోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Apple తన ఐఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం స్మార్ట్‌ఫోన్‌లో కొత్త డిజైన్, మెరుగైన పనితీరు , పాత్‌బ్రేకింగ్ ఫీచర్‌లను తీసుకువస్తుంది. మీరు లేటెస్ట్ కెమెరా టెక్నాలజీ, స్పీడ్ ప్రాసెసింగ్ కావాలనుకునేవారికి ఈ కొత్త ఫోన్లు మంచి ఎంపిక అని చెప్పొచ్చు. 2025లో వచ్చే స్టాండ్‌అవుట్ మోడల్‌లను గురించి తెలుసు కుందాం.
iPhone SE4 ఐఫోన్ గురించి మనందిరికి తెలిసిందే.. దీనిని iPhone 16e గా రీబ్రాండ్ చేశారు. మార్చి 2025లో ఈ ఐఫోన్ ను ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. SE 4 aka 16e Apple ఇంటెలిజెన్స్‌తో అత్యంత సరసమైన ఐఫోన్‌గా అందించబడుతుంది.
Apple iPhone 17 .. ఈ డివైజ్ 2025సెప్టెంబరులో వచ్చే అవకాశం ఉంది. రెక్టాంగులర్ కెమెరా బంప్ తో వస్తుందని భావిస్తున్నారు.
ఐఫోన్ 17ఎయిర్.. ఈ ఏడాది వస్తున్న ఐఫోన్ల గురించి ఎక్కువగా మాట్లాడుకున్న వాటిలో ఒకటి. ఎయిర్ ఐఫోన్ 6ని కంటే అత్యంత సన్నని ఐఫోన్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఐఫోన్ 17 Air ఫంక్షన్ కంటే ఫారమ్‌కు ప్రాధాన్యతనిస్తుంది. ఇది బేస్ iPhone 17 మాదిరిగానే A19 చిప్ వంటి స్పెక్స్‌ను కలిగి ఉంటుంది. ఇందులో యాపిల్స్ ఇన్ హౌస్ 5 మోడెమ్ , హై రిఫ్రెష్ డిస్‌ప్లే వంటి మరో రెండు అద్భుతమైన ఫీచర్లతో రాబోతోంది.
ఐఫోన్ 17 ప్రో.. ఇది 16 ప్రో మాదిరిగానే 6.3 అంగుళాల డిస్‌ప్లేతో రానుంది. అయితే దాని డిజైన్ లో కొన్ని మార్పులతో వస్తుంది. ఫోన్ 17 ప్రో.. రీడిజైన్ చేయబడిన హారిజెంటల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరొకటి ఇది ట్రయాంగిల్ వన్‌ను లో ఉంటుందని భావిస్తున్నారు.
iPhone 17 Pro Max .. ఈ స్మార్ట్ డివైజ్ చిన్న iPhone 17Pro లోని బెస్ట్ ఫీచర్లన్నీ ఉంటాయి. మెరుగైన బ్యాటరీ లైఫ్ వంటి కొన్ని చిన్న పెర్క్‌లతో ఈ ఏడాదిలో వచ్చే కొత్త ఫోన్లలో ఒకటి.