హైదరాబాద్, వెలుగు: స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజల భాగస్వామ్యంతో ఐ ఓట్ ఫర్ ష్యూర్ అన్న నినాదంతో 5కె రన్ నిర్వహించారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన 5 కె రన్ లో అధికారులు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, స్టూడెంట్లు, యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ నెల 13 న ఓటు వేయడం మర్చిపోవద్దని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటేయాలని రన్ సందర్భంగా అధికారులు కోరారు. రన్ లో పాల్గొన్నోళ్లంతా తమ ఇంట్లోవాళ్లకు, చుట్టుపక్కలవాళ్లకు ఓటింగ్‌పై అవహన కల్పించాలన్నారు. ఓటర్ జాబితాలో పేరును చెక్ చేసుకోవాలని, పోలింగ్ కేంద్రాన్ని చూసుకోవాలని సూచించాలన్నారు. రన్ కార్యక్రమాల్లో అసిస్టెంట్ స్వీప్ నోడల్ ఆఫీసర్లు, డీపీవోలు, సీవోలు తదితరులు పాల్గొన్నారు.