ప్లానెట్ పరేడ్..ఆకాశంలో కొన్ని గ్రహాలు ఒకేసారి నిలబడిన అద్భుత విన్యాసం..ఇలా గ్రహాలన్నీ ఒకే సరళ రేఖపైకి రావడం ఖగోళ వింతగా మన శాస్త్రవేత్తలు చెబు తుంటారు.. ప్రపంచ వ్యాప్తంగా ఒక్కోచోట ఒక్కో రోజులు ఇలాంటి ఖగోళ అద్భుతాలు జరుగుతుంటాయి.
జనవరి 21, 24 తేదీల్లో ఇండియాలో ఆరు గ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చి కనుల విందు చేశాయి. మరోసారి జనవరి 25నకూడా కనిపించబోతున్నాయి. 25 న రాత్రి ఆకాశంలో అరుదైన ఖగోళ సంఘటన జరగబోతుంది. సూర్యుని చుట్టూ తిరిగే ఎనిమిది గ్రహాలలో ఐదు గ్రహాల ఒకే వరసగాలోకి రానున్నాయి. దీని గ్రహ కవాతు అని అంటారు.
ఈ విశేషమైన దృగ్విషయాన్ని వీక్షించేందుకు గుజరాత్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలోని గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (GUJCOST) ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గుజరాత్ సైన్స్ సిటీ, ప్రాంతీయ విజ్ఞాన కేంద్రాలు (RSCలు), కమ్యూనిటీ సైన్స్ సెంటర్లు (CSCలు) సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
గ్రహాల కవాతు శాస్త్రీయ ప్రాముఖ్యత
భూమి నుండి కనిపించే ఆకాశంలోని ఒకే ప్రాంతంలో బహుళ గ్రహాలు ఒకే వరసలోకి వచ్చినప్పుడు గ్రహాల కవాతు జరుగుతుంది. ఈ సందర్భంగా బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి శని ఒక అందమైన ఖగోళ ఆర్క్‌లో కి వస్తాయి. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని అందిస్తుంది.
ALSO READ | మా కంటెంట్ కాపీ కొడుతున్నారు..Chat GPTపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
ఖగోళ శాస్త్రంలో ప్రజల ఆసక్తిని పెంపొందించడంతోపాటు విద్యార్థులు,ఔత్సాహికులలో శాస్త్రీయ ఉత్సుకతను ప్రోత్సహిస్తుంది. ప్లానెటరీ పెరేడ్ అనేది విశ్వంలోని అద్భుతాలకు ప్రతిబింబం. పరిశీలన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా యువత ,సాధారణ ప్రజలలో ఉత్సుకతను రేకెత్తించడం, ఖగోళ మెకానిక్స్ ,కాస్మోస్ గురించి అవగాహన పెంపొందించడం లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
2025.. జనవరి 25న సాయంత్రం ఆకాశంలో బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని ఈ ఐదు గ్రహాలు ఒకే వరసలోకి రానున్నాయి. ఈ అసాధారణ అమరికను గ్రహాల కవాతు (ప్లానెట్ పరేట్) అంటారు. ఈ గ్రహాల్లో నాలుగు మాత్రమే కంటికి కనిపిస్తుంది. ఈ ఖగోళ వస్తువులు కలిసినప్పుడు అవి రాశిచక్ర గుర్తులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. ఈ సంఘటన వారి రాశిని బట్టి వ్యక్తులపై తీవ్ర ప్రభావాలను చూపుతుందంటున్నారు.
ఫిబ్రవరి 28న మరోసారి 7 గ్రహాలు
ఫిబ్రవరి 28, 2025 న మరోసారి గ్రహాల పరేడ్ ఉంటుందని ఖగోళ శాస్త్రజ్ణులు చెబుతున్నారు. ఫిబ్రవరి 28న సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఏడు గ్రహాలు - శని, మెర్క్యురీ, నెప్ట్యూన్, వీనస్, యురేనస్, బృహస్పతి,మార్స్ - ఆకాశంలో ఒకే లైన్ కనిపించనున్నాయి. వాటిలో నాలుగు (బుధుడు, శుక్రుడు, బృహస్పతి ,అంగారకుడు) కంటితో సులభంగా కనిపిస్తాయి. యురేనస్ ,నెప్ట్యూన్ కోసం, ఒక జత బైనాక్యులర్స్ లేదా చిన్న టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు. శనిగ్రహాన్ని చూడటం అత్యంత కష్టతరమైన లక్ష్యం - గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉన్నందున ఖచ్చితంగా చూడలేమని శాస్త్రజ్ణులు చెబుతున్నారు.