సూరత్ లోని సచిన్ ప్రాంతాలో శనివారం( జూలై 6) మధ్యాహ్నం ఐదంస్తుల భవనం కుప్పకూలింది. భవన శిథిలాల కింద 15 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘట న స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి ఓ మహిళను సురక్షితంగా బయటికి తీశారు.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ భవనం కుప్పకూలిందని స్థానిక పోలీసులు చెప్పారు.2017లో నిర్మించిన ఈ భవనంలో 30 ప్లాట్లు ఉండగా.. వాటిలో ఆరు కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు సూరత్ పోలీసు కమిషనరల్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ తెలిపారు.
భవనం కూలిపోయిన ఐదు నిమిషాల తర్వాత సమాచారం వచ్చింది. సీనియర్ అధికారులు, రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న ఓ మహిళను రక్షించారు.