హైదరాబాద్: ఐదో ఎడిషన్ఎస్ఎఫ్ఏ(స్పోర్ట్స్ ఫర్ ఆల్) ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ ఏడాది నాలుగు నెలల వ్యవధిలో మొత్తం 10 ఎస్‌ఎఫ్‌ఏ ఛాంపియన్‌షిప్ లు జరుపుతామని నిర్వాహకులు ప్రకటించారు. వీటి ద్వారా 2 లక్షల మంది అథ్లెట్లకు 3,040 క్రీడాంశాల్లో పోటీపడే అవకాశం కల్పించనున్నారు. ఫలితంగా ఇండియాలో స్పోర్ట్స్‌లో నంబర్‌వన్‌గా ఉండే స్కూల్‌ను ఎంపిక చేయనున్నారు.
స్పోర్ట్స్అథారిటీ ఆఫ్ ఇండియాతో(సాయ్)తో భాగస్వామ్యంలో ఉన్న ఎస్‌ఎఫ్‌ఏ 2028 వరకు జరిగే ఖేలో యూత్ గేమ్స్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. 2015లో మొదలుపెట్టిన ఈ మల్టీ స్పోర్ట్ స్కూల్ కాంపిటీషన్ ప్లాట్‌ఫారమ్.. వచ్చే ఐదేళ్లలో 50 నగరాల్లో 150 చాంపియన్‌షిప్స్ నిర్వహించేందుకు రెడీ అవుతోంది.