బెంగళూరు : ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను సాధించిన యంగ్ టీమిండియా.. ఆఖరి మ్యాచ్‌పై దృష్టి పెట్టింది. ఆదివారం జరిగే ఐదో టీ20లోనూ కంగారూలను ఓడించి సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. మరో వారం రోజుల్లో సౌతాఫ్రికా టూర్ మొదలుకానున్న నేపథ్యంలో అత్యుత్తమ స్థాయిలో సిరీస్‌ను ముగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో కొన్ని మార్పులు జరిగే చాన్స్ ఉంది. ఏడాది తర్వాత షార్ట్ ఫార్మాట్ మ్యాచ్ ఆడిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పెద్దగా ఆకట్టుకోలేదు.
దీంతో ఈ మ్యాచ్‌లో తన సత్తా ఏంటో చూపేందుకు రెడీ అవుతున్నాడు. పేసర్ దీపక్ చహర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వికెట్లు తీసినా రన్స్ ఆపడంలో ఫెయిలవుతున్నాడు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు చాన్స్ ఇవ్వాలని మేనేజ్‌మెంట్ యోచిస్తున్నది. గత ఐదు టీ20ల్లో కేవలం రెండే వికెట్లు తీసిన సుందర్‌లో కాన్ఫిడెన్స్‌ను పెంచేందుకు ఆసీస్‌పై బరిలోకి దించాలని చూస్తోంది. ఓపెనింగ్‌లో యశస్వి, రుతురాజ్ ప్లేస్‌కు డోకాలేదు. అయితే తిలక్ వర్మకు చాన్స్ ఇవ్వాలంటే వీళ్లలో ఎవరినైనా తప్పిస్తారేమో చూడాలి. నాలుగో మ్యాచ్‌లో ఫినిషర్లుగా ఆకట్టుకున్న రింకూ, జితేశ్‌ను కంటిన్యూ చేయనున్నారు. ఒకవేళ ఇషాన్ వస్తే జితేశ్‌ను తప్పిస్తారు. అక్షర్ ప్లేస్‌ను సుందర్‌కు కేటాయిస్తే రవి బిష్ణోయ్‌ను కొనసాగిస్తారు. ముకేశ్, దీపక్, అవేశ్ ఖాన్ పేస్ బాధ్యతలు తీసుకోనున్నారు.
పరువు కోసం..
పదమూడు రోజుల కిందట వన్డే వరల్డ్ కప్ గెలిచి జోరుమీదున్న ఆస్ట్రేలియా ఇప్పుడు పరువు కోసం పోరాడుతోంది. ఇప్పటికే సిరీస్‌ను చేజార్చుకున్న కంగారూలు కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ఊరట చెందాలని భావిస్తున్నారు. కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వడంతో జట్టులో ఉన్న ప్లేయర్లు ఎప్పుడు ఎలా ఆడతారో తెలియని పరిస్థితి నెలకొంది. నలుగురు కొత్త ప్లేయర్లను తీసుకున్నా వాళ్లపై నమ్మకం పెట్టలేకపోతున్నారు. దీంతో సీనియర్లు మాథ్యూ వేడ్, ట్రావిస్ హెడ్, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్‌పైనే ఎక్కుగా ఆశలు పెట్టుకున్నారు. హెడ్ ఓపెనింగ్ బాగున్నా.. మిగతా వాళ్లు ఫెయిల్ కావడంతో ఆసీస్‌కు సరైన ఆరంభం లభించడం లేదు. మిడిల్‌లో డేవిడ్, షార్ట్ మాత్రమే ఆడుతుండటం ప్రతికూలాంశంగా మారింది. బౌలింగ్‌లో హార్డీ, బెరెన్‌డార్ఫ్, డ్వారిషస్ రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. స్పిన్నర్లుగా క్రిస్ గ్రీన్, తన్వీర్ సంగా మరింత ప్రభావం చూపాలి. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని తెలుస్తోంది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలవాలంటే కంగారూలు బ్యాటింగ్‌లో మెప్పించాల్సి ఉంటుంది.
తుది జట్లు (అంచనా):
ఇండియా : సూర్య కుమార్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ / తిలక్ వర్మ, జితేశ్ శర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్ / వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.
ఆస్ట్రేలియా : మాథ్యూ వేడ్ (కెప్టెన్), జోష్ ఫిలిప్స్, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, ఆరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, డ్వారిషస్, క్రిస్ గ్రీన్, బెరెన్‌డార్ఫ్, తన్వీర్ సంగా / నేథన్ ఎలీస్ / కేన్ రిచర్డ్‌సన్.