6 అదానీ గ్రూప్ సంస్థలకు సెబీ నోటీసులు

6 అదానీ గ్రూప్ సంస్థలకు సెబీ నోటీసులు

అదానీ గ్రూప్ సంస్థలకు సెబీ నోటీసులు జారీ చేసింది. పార్టీ లావాదేవీలలో ఉల్లంఘనలు, లిస్టింగ్ నిబంధనలు పాటించనందుకు 6 అదానీ గ్రూప్ సంస్థలకు సెక్యూ రిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBi)షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తమ రెగ్యేలేటరి ఫైలింగులలో వెల్లడించాయి. 

అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ పవర్, అదనీ ఎనర్జీ సోల్యూషన్స్, అందనీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్ లకు సెబీ నోటీసులు ఇచ్చింది. గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యానికి ఫ్లాగ్ షిప్ అయిన అదానీ ఎంటర్ ప్రైజెస్. మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో రెండు షోకాజ్ నోటీసులను వెల్లడించింది.  

థర్డ్ పార్టీలతో కొన్ని లావాదేవీలు, పీర్ చెల్లుబాటుకు సంబంధించిన సంబంధిత పార్టీ లావాదేవీలకు సంబంధించిన లిస్టింగ్ ఒప్పందం, LODR నిబంధనలను పాటించడం లేదని అదానీ ఎంటర్ ప్రైజెస్ కు సెబీ నోటీసులు పంపింది. 6,000కు పైగా సంబంధిత పార్టీ లావాదేవీలపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. అదానీ గ్రూప్ కార్యకలాపాలపై నీలినీడలు కమ్ముకున్నాయి.

యుఎస్‌కు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలపై దర్యాప్తు తర్వాత సెబి పరిశీలన జరిగింది. సుప్రీం కోర్ట్‌ విచారణలో ఉన్న 13 నిర్దిష్ట సంబంధిత పార్టీ లావాదేవీలను గుర్తించింది. హిండెన్‌బర్గ్ నివేదికలో హైలైట్ చేసిన ఆందోళనలను షోకాజ్ నోటీసులలో వెల్లడించింది.