రామడుగు, వెలుగు : రామడుగు మండలం గోపాల్రావుపేట నుంచి గంగాధర మండలం బూరుగుపల్లికి రోడ్డు నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరు చేసినట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గురువారం రామడుగు మండలం తిర్మలాపూర్ వద్ద రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తూతూమంత్రంగా రోడ్డుకు రిపేర్లు చేయించిందన్నారు.
రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో రామడుగు ఎంపీపీ జవ్వాజి హరీశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి, లీడర్లు కోల రమేశ్, దుబ్బాసి బుచ్చయ్య, పాల్గొన్నారు.
ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
గంగాధర/రామడుగు, వెలుగు : గంగాధర మండలం లింగంపల్లిలో పోచమ్మ తల్లికి, రామడుగు మండలం మోతె గ్రామంలో వేంకటేశ్వర స్వామికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గురువారం ప్రత్యేక పూజలు చేశారు.
మోతె వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో ఆయన పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట అల్గి చైర్మన్ అంజనీప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, తిరుపతి, లీడర్లు విద్యాసాగర్‌రెడ్డి, యగ్నేశ్ పాల్గొన్నారు.