![కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి](https://static.v6velugu.com/uploads/2020/01/car-3.jpg)
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం కొత్తపల్లి సమీపంలో ఓ కారు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఒడిశాకు చెందిన వీరంతా ఒకే కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు క్రేన్ తో కారును బయటకు తీశారు. సింహాచలం నుంచి బరంపుర(ఒడిశా) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.