చాలామంది అధిక బరువుతో బాధపడుతుంటారు. రకరకాల మందులు వాడుతుంటారు..థెరపీలు ట్రై చేస్తుంటారు..కొంతమంది బరువు తగ్గించుకునేందుకు ఆహారం మానేస్తుంటారు.. అయితే బరువు తగ్గాలంటే మనం రోజూ తాగే కొన్ని రకాల డ్రింక్స్ వల్ల మంచి ఫలితాలుంటాయని చెబుతున్నారు డైటీషియన్లు. అలా బరువు తగ్గేందుకు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరించే ఆరు రకాల డ్రింక్స్ (పానియాలు) గురించి తెలుసుకుందాం.
గ్రీన్ టీ:
గ్రీన్ టీ తాగడం వల్ల కొవ్వును కరిగించడంలో సహాయ పడుతుంది.. అంతేకాదు జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. గ్రీన్ టీ పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గ్రీన్ టీలో బాడీ మెటాబాలిజాన్ని మెరుగుపర్చే గుణాలుంటాయని డైటీషియన్లు చెబుతున్నారు.
లెమన్ వాటర్:
పొద్దున లేవగానే వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఆరోగ్యంతోపాటు అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. వెచ్చని నీటిలో నిమ్మ రసంతో జీవక్రియ మెరుగుపడుతుంది. శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. మలబద్ధకం వంటి నిర్వీషీకరణ సమస్యలుంటే తొలగిపోతాయి.
యాపిల్ సైడర్ వెనిగల్ డ్రింక్ :
ఈ డ్రింక్ తో ఆనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. యాపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో కలుసుకుని తాగితే ఆకలిని నియంత్రణలోఉంటుంది. దీంతోపాటు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిచ్చవచ్చుంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆల్లం టీ:
అల్లంటీతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు ఏవైనా ఉంటే ఇట్టే పరిష్కరించబడతాయంటున్నారు డైటీషియన్లు. శరీరంలో థర్మోజెనిసిస్ ను పెంచడం ద్వారా కేలరీలను వినియోగించుడంలో సహాయ పడతాయంటున్నారు.
బ్లాక్ టీ:
బ్లాక్ టీని వ్యాయామం చేసేటప్పుడు తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలుంటాయంటున్నారు నిపుణులు. బ్లాక్ టీ జీవక్రియను పెంచడమే కాకుండా.. కొవ్వులను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.
దాల్చిన చెక్క టీ:
దాల్చిన చెక్క టీతో కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చంటున్నారు డైటీషియన్లు. ఆకలిని నియంత్రిస్తుంది.. కొవ్వులను కరిగించేందుకు సాయపడుతుంది.