పరమ నీచులు : 14 ఏళ్ల బాలికపై ఆరుగురు అత్యాచారం

14 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది. రాత్రిపూట బాలిక బయటకు వెళ్లినప్పుడు ఈ  ఘటన చోటుచేసుకుంది.  మద్యం మత్తులో ఉన్న యువకుడు ఆమెను మొదట కిడ్నాప్ చేశాడు, తరువాత అతని ఐదుగురు స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించాడు.  దీంతో ఆ బాలికను  సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి ఆరుగురు అత్యాచారం చేశారు.

బాలిక అపస్మారక స్థితిలోకి రావడంతో ఆరుగురు అక్కడి నుంచి పారిపోయారు.  రాత్రంతా వెతికిన కనిపించిన  కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం పొలంలో వదిలేసి కనిపించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్పీ బర్ భరత్ సోనీ నేతృత్వంలోని బృందం నిందితుల ఇళ్లపై దాడులు చేసి బిట్టు కుమార్, రవికుమార్, సూరజ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు.

మిగిలిన ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారు. ముగ్గరు నిందితులపై  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసామని మరో ముగ్గరి నిందితులను పట్టుకునేందుకు పలు ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభించామని తెలిపారు.