కవ్వాల్​ టైగర్​జోన్ పరిధిలో ఆరుగురు ఫారెస్ట్​ ఆఫీసర్ల సస్పెన్షన్‌

జన్నారం,వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు ఫారెస్ట్ ఆఫీసర్ల పై సస్పెన్షన్​ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కాకుండా కలప అక్రమ రవాణాలో హస్తం ఉందనే ఆరోపణలు రావడంతో మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోని ఆరుగురు ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లపై వేటు వేశారు.

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ డివిజన్ ఇందన్ పెల్లి రేంజ్ లోని కవ్వాల ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అఫ్జల్​ఖాన్, బీట్ ఆఫీసర్ శ్రీధర్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉన్న ఇస్లాంపూర్ వెస్ట్, కొత్తపెల్లి ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు వినయ్ కుమార్, ఇమ్రాన్ లను కాళేశ్వరం జోన్ సీఎఫ్​శాంతారామ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే నిర్మల్ జిల్లా ఉడుంపూర్ ఫారెస్ట్ రేంజ్ లోని ఇస్లాంపూర్ ఈస్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రవికుమార్, బీట్ ఆఫీసర్ భూమేశ్​లను నిర్మల్ డీఎఫ్ వో రాంకిషన్ సస్పెండ్ చేశారు.