- జంట జలాశయాల నుంచి మూసీలోకి వరద
హైదరాబాద్‌సిటీ, వెలుగు : జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఫుల్ట్యాంక్లెవల్కు చేరడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. మంగళవారం హిమాయత్‌సాగర్ ఒక గేటును అడుగు మేర ఎత్తి 348 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ఉస్మాన్‌సాగర్6 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 1,428 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
మూసీ పరీవాహక ప్రాంతంలోని మంచిరేవుల కాలువ బ్రిడ్జిపై నుంచి వదర నీరు పారుతుండడంతో మంచిరేవుల, నార్సింగి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పరివాహక ప్రాంతవాసులను వాటర్‌బోర్డు అధికారులు అప్రమత్తం చేశారు. ఉస్మాన్ సాగర్ వద్ద 1400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1428 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో, హిమాయత్‌సాగర్ వద్ద 350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 348 ఔట్‌ఫ్లో కొనసాగుతోంది.