రూ.826 కోట్లతో.. కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు

రూ.826 కోట్లతో.. కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి (KBR) పార్కు చుట్లూ రోడ్ల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబీఆర్ పార్క్ పరిధిలో అండర్ పాస్, ఫ్లైఓవర్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. కేబీఆర్ పార్కు చుట్టూ రూ. 826కోట్లతో 6 జంక్షన్లు నిర్మించనున్నారు. రెండు ప్యాకేజీలుగా నిర్మించే ఈ ప్రాజెక్ట్‌లో మొదటిగా 2 ఫ్లైఓవర్లు, 3 అండర్‌పాస్‌లు నిర్మిస్తారు. రెండో విడత ప్యాకేజీలో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్‌ పాస్ ల నిర్మాణం చేపడతారు. 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని  KBR పార్క్ ఎంట్రన్స్ వద్ద ఫ్లైఓవర్, అండర్ పాస్,జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ వద్ద, రోడ్ నెంబరు 45 జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, పూరి జగన్నాథ్ టెంపుల్ వద్ద మహారాజా అగ్రసేన్ జంక్షన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.