మూసాపేట, వెలుగు: గంజాయి అమ్మేందుకు యత్నిస్తున్న ఇద్దరు యువకులను కూకట్పల్లి, బాలానగర్ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డికి చెందిన ఇద్దరు స్నేహితులు బిజ్జ వికాస్(25), గంట రాకేశ్(26) కొంతకాలంగా ఏపీలోని అరకు నుంచి గంజాయి తీసుకువచ్చి సిటీలో అమ్ముతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు గురువారం కూకట్పల్లి వై జంక్షన్వద్ద నిఘా పెట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.లక్ష విలువ చేసే ఆరున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు.