
తెలంగాణలోని పలు జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి ఒకే సారి 6 నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. వీటికి ఆన్లైన్లో జనవరి 11 నుంచి అప్లై చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులకు మార్చిలో ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
జూనియర్ అసిస్టెంట్: హైకోర్టు మొత్తం 271 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్: వివిధ జిల్లాల్లో 76 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎగ్జామినర్: ఇంటర్ అర్హతతో మొత్తం 63 ఎగ్జామినర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 11 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
రికార్డ్ అసిస్టెంట్: ఈ విభాగంలో మొత్తం 97 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
ప్రాసెస్ సర్వర్: మొత్తం 163 ప్రాసెస్ సర్వర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఫీస్ సబార్డినేట్: ఆఫీస్ సబార్డినేట్ కు సంబంధించి మొత్తం 1226 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 7వ తరగతి నుంచి 10 వ తరగతి మధ్య చదువు పూర్తి చేసి ఉండాలి. ఇంతకు మించి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఒక్కో నోటిఫికేషన్ కు జనరల్, బీసీ అభ్యర్థులు రూ.600 చొప్పున.. ఎస్సీ, ఎస్టీ, ఈబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు జనవరి 11 నుంచి జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు ఫిబ్రవరి 15న రిలీజ్ చేస్తారు. పరీక్షలు మార్చిలో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.tshc.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.