హర్యానాలో రోడ్డు ప్రమాదం.. కాల్వలోకి పడిన మినివ్యాన్.. ఆరుగురు మృతి

హర్యానాలో రోడ్డు ప్రమాదం.. కాల్వలోకి పడిన మినివ్యాన్.. ఆరుగురు మృతి

హర్యాలోని ఘోర ప్రమాదం జరిగింది..శనివారం (ఫిబ్రవరి 1) అర్థరాత్రి ఫరీదాబాద్ వద్ద భాక్రా కాలువలో పెళ్లిబందంతో వెళ్తున్న మినివ్యాన్ పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో 6 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఓ పెళ్లికి హాజరై వస్తుండగా ప్రమాదం జరిగింది.. ప్రమాద సమయంలో మినీ వ్యాన్ లో మొత్తం 14 మంది ఉన్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది.  

స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఫరీదాబాద్  సమీపంలో అర్థరాత్రి మినీ వ్యాన్ కాల్వలోకి దూసుకెళ్లింది. దాదాపు 60 కిలోమీటర్ల మేర కొట్టుకుపోయింది. 14మందిలో ఆరుగురి మృత దేహాలను వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరిని సజీవంగా కాపాడినట్లు తెలిపారు. ఎన్డీఆర్ ఎఫ్ , ఎస్డీ ఆర్ ఎఫ్ బృందాలు గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.