ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 6.4 తీవ్రత.. ఢిల్లీలోనూ ప్రకంపనలు..

ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం..  రిక్టర్ స్కేల్పై 6.4 తీవ్రత.. ఢిల్లీలోనూ ప్రకంపనలు..

ప్రపంచాన్ని భూకంపాలు వణికిస్తున్నాయి. మయన్మార్, థాయిలాండ్ భూకంపాలు తీవ్ర నష్టాన్ని కలిగించిన తర్వాత ఆసియా ఖండంలో భూ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం (ఏప్రిల్ 16) ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించడం పొరుగు దేశాలను భయాందోళనకు గురిచేసింది. ఉదయం 4 గంటల 43 నిమిషాలకు రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో భూమి తీవ్రంగా కంపించింది. 

ఆఫ్ఘాన్ లోని హిందూ కుష్ ప్రాంతంలో వచ్చిన ఈ భూకంపంతో పాకిస్తాన్ తో పాటు ఇండియాలో కూడా కొన్ని ప్రాంతాలు ప్రకంపనలకు గురయ్యాయి. నేషనల్ సిస్మాలజీ ప్రకారం ఢిల్లీలో భూప్రకంనలు సంభవించాయి. భయాందోళనతో జనం బయటకు పరిగెత్తారు. భూకంపం వచ్చిన పరిస్థితులను వీధుల్లో చేరి చర్చించుకున్నారు. ఇంట్లో వస్తువులు కదలటం, కొన్ని వస్తువులు కింద పడటంతో బయటికి పరిగెత్తినట్లు మీడియాకు చెప్పారు.

EQ of M: 5.9, On: 16/04/2025 04:43:58 IST, Lat: 35.83 N, Long: 70.60 E, Depth: 75 Km, Location: Hindu Kush, Afghanistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/cdndqE0OQR

— National Center for Seismology (@NCS_Earthquake) April 15, 2025

భూ ప్రకంపనలతో పాకిస్తాన్ ఒక్కసారిగా వణికిపోయింది. దేశ వ్యాప్తంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలజికల్ సెంటర్ (EMSC) ప్రకారం.. రాజధాని కాబూల్ కు 34 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో భారీ నష్టం సంభవించిందని స్థానిక మీడియా ప్రకటించింది. పూర్తి వివరాలు వెల్లడించలేదు. 

ఉదయం వచ్చిన భూకంపం మొదటగా 6.9 తీవ్రతతో వచ్చినట్లు ప్రకటించారు. ఆ తర్వాత 6.4 గా నమోదైనట్లు చెప్పారు. తర్వాత సిస్మాలజీ విభాగం.. 5.9 గా రివైజ్ చేసింది.

యూరేషియన్, ఇండయన్ టెక్టానిక్ ప్లేట్ల మధ్య ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తదితర దేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతం ఎక్కువగా భూకంపం సంభవించే రీజియన్ లో ఉంది. ప్లేట్స్ కదలికలు, సర్దుబాట్ల వలన అప్పుడప్పుడు పాక్ లో భూకంపాలు నమోదు అవుతూనే ఉంటాయి. దశాబ్దాలుగా టెర్రరిజం, ఉగ్రవాదంతో అంతర్గత కలహాలతో సతమతం అవుతున్న ఆఫ్ఘనిస్తాన్.. దేశంపై తరుచుగా వచ్చే భూకంపాలు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది పరిస్థితి.

ఇటీవల మయన్మార్, బ్యాంకాక్ లో వచ్చిన భూకంప ప్రళయం సృష్టించిన సంగతి తెలిసిందే..3 వేల మందికి పైగాచనిపోగా..4 వేల మందికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మందిని ఇంకా బయటకు తీసేందుకు కృషి చేస్తున్నారు.