మునుగోడుతో పాటు దేశంలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ కొనసాగుతోంది. ఈ అసెంబ్లీ స్థానాలు 6 రాష్ట్రాల (తెలంగాణ, బీహార్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా) పరిధిలో ఉన్నాయి. బీహార్ లోని గోపాల్ గంజ్, మోకానా స్థానాలు, ఒడిశాలోని ధామ్ నగర్, ఉత్తరప్రదేశ్ లోని గోలా గోక్రా నాథ్, మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్, హర్యానాలోని ఆదంపూర్ లలో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా స్థానాల్లో పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అంధేరీ ఈస్ట్, గోలా గోక్రా నాథ్, ధామ్ నగర్ ఎమ్మెల్యేలు మృతిచెందడంతో ఆ మూడు స్థానాలకు బైపోల్ అనివార్యమైంది. ఇంకొన్ని చోట్ల ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కారణంగా ఉప ఎన్నిక వచ్చింది. ఇవాళ పోలింగ్ జరుగుతుండగా.. 6న ఓట్లను లెక్కించి ఫలితాలు వెలువడనున్నాయి.