క్లాస్ రూంలో టీచర్ల డ్యాన్స్ .. డబ్బులు విసిరిన తోటి టీచర్లు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిష్ట (నేషనల్ ఇనిషియేటివ్ ఫర్స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్ మెంట్ )లో భాగంగా ఓ డిగ్రీ కాలేజీలో ఓ150 మంది టీచర్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు. బోర్ కొట్టిందో ఏమో గానీ, ఓ ఆరుగురు టీచర్లు డ్యాన్సులేశారు. పైసలిసిరి మరికొందరు ప్రోత్సహించారు. ఆ వీడియో కాస్తా అధికారుల కళ్లల్లో పడడంతో, ఆరుగురు టీచర్లను సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్​లో ని ఆగ్రా జిల్లాలో ఉన్న కుతుక్పూర్ చనురాలో ఇటీవల జరిగింది. ఇష్ట ట్రైనింగ్ కోసం 150 మంది టీచర్లను గౌరీశంకర్ డిగ్రీ కాలేజ్​కు తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రైమరీ స్కూల్ టీచర్ , సప్నా చౌదరీ పాటలకు స్టెప్పులేసింది. ఆమెను ప్రోత్సహించేలా తోటి టీచర్లు ఆమె మీదకు పైసలిసిరారు. లంచ్ తర్వాత టీచర్లు ఇలా డ్యాన్స్ చేశారని అధికారులు తెలిపారు. టీచర్లు క్రమ శిక్షణ తప్పడం సరికాదని, వాళ్ల చర్యతో రాష్ట్ర విద్యాశాఖ పరువు పోయిందని, ఆరుగురు టీచర్లను సస్పెండ్ చేశామని విద్యాశాఖ అధికారి ఒకరు చెప్పారు.