
దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల(ఈఎంఆర్‌ఎస్)లో డైరెక్ట్ ప్రాతిపదికన 6,329 పోస్టుల భర్తీకి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్స్) అప్లికేషన్స్ కోరుతోంది.
ఖాళీలు: ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ)– 5,660, హాస్టల్ వార్డెన్ (పురుషులు)– 335, హాస్టల్ వార్డెన్ (మహిళలు)– 334 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: టీజీటీ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ; టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ఈఎంఆర్‌ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు టీజీటీ రూ.1500; హాస్టల్ వార్డెన్ రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించి ఆగస్టు 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం www.emrs.tribal.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.