ట్రయల్​ కోర్టుల్లో 16 పోస్టులు ఖాళీ..అడ్వకేట్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

 హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్ ట్రయల్ కోర్టుల్లో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సెల్ నియామకం కోసం ఆసక్తి, అర్హత గల అడ్వకేట్లు దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్ఎంసీ కోరింది. ఆయా ట్రయల్ కోర్టుల్లో 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. రంగారెడ్డి జిల్లా ట్రయల్ కోర్టులో 8, రామచంద్రపురం కోర్టులో ఒకటి, సికింద్రాబాద్, హైదరాబాద్ కోర్టుల్లో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పింది.

దరఖాస్తుదారులకు జిల్లాల బార్ అసోసియేషన్ లో 10 సంవత్సరాలు, సీనియర్ సివిల్ కోర్టులో 7 సంవత్సరాలు, జూనియర్ సివిల్ కోర్టులో 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఈ నెల 23లోగా జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులోని లీగల్ సెల్  సెక్షన్​లో అప్లికేషన్లు అందజేయాలని సూచించింది.