రూ.5 కాయిన్ మింగిన బాలుడు

రూ.5 కాయిన్ మింగిన బాలుడు

ఖమ్మం టౌన్, వెలుగు : రూ.5 కాయిన్​ను ఓ బాలుడు మింగి అస్వస్థతకు గురైన ఘటన ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో  జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మామిడి కృష్ణ, మమత దంపతులకు శిరీష్ (6) కుమారుడు ఉన్నాడు.  శుక్రవారం బాలుడు రూ.5 కాయిన్ తో ఆడుకుంటూ ఆ కాయిన్​ను మింగేశాడు. 

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న బాలుడిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఖమ్మంలోని నెహ్రూ నగర్ సాయిరాం గ్యాస్ట్రో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. గొంతులో ఇరుక్కున్న కాయిన్ ను డాక్టర్లు శనివారం ఎండోస్కోపి ద్వారా బయటకు తీయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.