
- పోచారంలోరెచ్చిపోయిన సైకో..
- హైవేపే వెళ్తున్న వాహనదారులపై రాళ్ల దాడి
- రెండు కార్లు,ఆటో అద్దాలు ధ్వంసం
ఘట్కేసర్, వెలుగు: పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువకుడు బీర్‌సీసాతో దాడి చేయండంతో ఆరేండ్ల పాప మృతి చెందింది. బిహార్‌కు చెందిన జగేశ్వర్ భార్య, కూతురు రియాకుమారి(6)తో కలిసి కొంత కాలం కింద సిటీకి వలస వచ్చాడు. పోచారం మున్సిపాలిటీ లేబర్ క్యాంప్ లో ఉంటూ ఇన్ఫోసిస్క్యాంపస్లో భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్ పర్బతిపూర్ కు చెందిన హప్న హెమ్ బ్రూమ్(30) శుక్రవారం అక్కడి పనిలో చేరాడు. కాగా శనివారం మధ్యాహ్నం పని ప్రదేశంలో ఆడుకుంటున్న రియాకుమారి(6)పై హెమ్ బ్రూమ్ బీరుసీసాతో దాడి చేసి పరారయ్యాడు.
తీవ్రంగా గాయపడిన పాపను తల్లిదండ్రులు దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. పాపను బాటిల్‌తో కొట్టాక.. అక్కడి నుంచి పరారైన హప్న హెమ్ బ్రూమ్ జోడిమెట్ల వద్ద వరంగల్– -హైదరాబాద్ నేషనల్హైవేపై వెళ్లుతున్న వాహనదారులపై రాళ్లతో దాడి చేశాడు. జనాలు భయంతో వణికిపోయారు. రెండు కార్ల అద్దాలు, ఆటో ధ్వంసమైంది.
పలువురికి గాయాలయ్యాయి. టైల్స్ దుకాణంపై రాళ్లు వేయడంతో టైల్స్ సైతం ధ్వంసమయ్యాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఈ నెల16న కోల్‌కతాలోని మల్దార్ స్టేషన్లో ఔరా ఎక్స్ప్రెస్ఎక్కి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 18న దిగినట్లు రైలు టికెట్ఉంది. మతిస్థిమితంగా లేక పాపపై దాడి చేశాడా? లేక మద్యం మత్తులో చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.