వీడిని తండ్రి అంటారా : ఆరేళ్ల కొడుకుతో బలవంతంగా ఎక్సర్ సైజ్ చేయించి చంపాడు

కన్న తండ్రే.. కొడుకుపై క్రూరత్వం చూపించాడు. పసిపిల్లడి చావుకు కారణమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటుంది ఓ కుటుంబం. తన కొడుకు లావుగా ఉన్నాడని బాధించిన తండ్రి తన ఆరెళ్ల పిల్లవాడిని ట్రెడ్ మీల్ పై వేగంగా పరిగెత్తమని శిక్షణ ఇచ్చాడు. ఈ క్రమంలోనే పిల్లవాడు పలుమార్లు ఆయాస పడి కింద పడిపోయాడు. అయినా వినిపించుకోని తండ్రి తన కొడుకును బలవంతంగా ఎక్కించాడు.

 అలా బలవంతం చేసిన కొద్ది రోజులకే పిల్లవాడు మంచాన పడ్డాడు. తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా పిల్లవాడికి సీటీ స్కాన్ తీయాలని చెప్పారు.  CT స్కాన్ చేయించుకుంటున్న సమయంలో, బాలుడు మూర్ఛను ఎదుర్కొన్నాడు మరియు తరువాత చికిత్స పొందుతూ మరణించాడు.  బాలుడు చనిపోవడానికి 12-24 గంటల ముందు గుండెకు బాధాకరమైన గాయంతో బాధపడుతున్నట్లు అనుమానిస్తున్నారు.

 మూడు సంవత్సరాల క్రితం జ ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. హృదయ విదారక వీడియోను చూడటం కష్టంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. రాక్షసుడు తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు