నిజామాబాద్, వెలుగు: జిల్లా కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ఆపరేషన్స్మైల్లో 60 మంది పిల్లలను గుర్తించామని ఇన్చార్జి సీపీ సింధూశర్మ తెలిపారు. శనివారం ఆమె మీడియాకు ప్రకటన రిలీజ్ చేశారు. ఇందులో బాలకార్మికులుగా పనిచేస్తున్న వారు, పేరెంట్స్ నుంచి తప్పిపోయిన 18 ఏండ్లలోపు పిల్లలు ఉన్నారన్నారు.
తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ఇచ్చి కొందరు పిల్లలను వారి వద్దకు చేర్చామని, మిగతా కొందరి పేరెంట్స్‌ను చేరుకోడానికి దర్పన్యాప్లో పిల్లల వివరాలు పెట్టామన్నారు. అప్పటి వరకు వారు చైల్డ్ వెల్ఫేర్ఆఫీసర్ల సంరక్షణలో ఉండేలా అప్పగించామన్నారు. పిల్లలను పనిలో నియమించుకోవద్దనే చట్టాన్ని ఉల్లఘించిన ఇద్దరిపై కేసులు నమోదు చేశామన్నారు.