శునకాలకు విషాహారం పెట్టి చంపిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలికొండ మండలం అరూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మత్స్యగిరి గుట్టలో కొందరు వ్యక్తులు విషాహారం కలిపిన ఆహారాన్ని పెట్టి వీధి శునకాలకు వేశారు. ఆ ఆహారం తిని అవి మృతి చెందాయి.
కొద్ది రోజులుగా పశువులు, గొర్రెల్ని కరిచి చంపుతుండటంతో కుక్కల్ని చంపినట్లు తెలుస్తోంది. కాగా, చంపేసిన జీవుల్ని ట్రాక్టర్లో తీసుకెళ్లి గ్రామ శివారులో పూడ్చిపెట్టారు. ఇదే విషయంపై సర్పంచిని వివరణ కోరగా.. ఈఘటనతో పంచాయతీకి సంబంధం లేదని, సిబ్బంది సమ్మెలో ఉన్నారన్నారు. తమ దృష్టికి రాలేదనడం గమనార్హం.