పట్టపగలే షిప్ట్ కారులో వచ్చి.. కత్తులతో బెదిరించి 6 తులాల బంగారం చోరీ

పట్టపగలే షిప్ట్ కారులో వచ్చి.. కత్తులతో బెదిరించి 6 తులాల బంగారం చోరీ

 హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు.  ఏప్రిల్ 21న మధ్యాహ్నం ఒంటిగంటకు 
 బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని P& T కాలనీ, అల్లం గిరి  మస్జిద్, సన్ సిటీలో    ఓ ఇంట్లోకి చోరబడ్డ దొంగల‌‌ ముఠా ఇంట్లో ఉన్న దంపతులను  కత్తులతో బెదిరించి  6 తులాల బంగారం, వెండితో పాటు 20వేల నగదు,  రెండు సెల్ ఫొన్లను దుండగులు లాక్కెళ్లారు. 

నలుగురు  దొంగలు షిప్ట్ డిజైర్ కారులో వచ్చినట్లు గుర్తించారు. దంపతులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ. రాజేంద్రనగర్ సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించారు పోలీసులు. దుండగులు తెల్లని షిప్ట్ డిజైర్ కారులో వచ్చి పరుగుడెతున్నట్లు ఫుజేజ్ లో ఉంది.

Also Read:-మత్తు కోసం ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు ఒకేసారి తీసుకున్న ఇంటర్ విద్యార్థులు.. ఒకరు మృతి