- 60 శాతం మంది యూనికార్న్ఫౌండర్ల విజయం
న్యూఢిల్లీ: మనదేశంలోని యునికార్న్ స్టార్టప్ వ్యవస్థాపకుల్లో 60 శాతం మంది తమ మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని సాధించారని తాజా స్టడీ వెల్లడించింది. స్టార్టప్ విలువ బిలియన్ డాలర్లకు పైగా ఉంటే యూనికార్న్అని పిలుస్తారు. ప్రైవేట్ సర్కిల్ రీసెర్చ్ ప్రకారం.. 261 యునికార్న్ వ్యవస్థాపకులలో, 29 శాతం మంది తమ మొదటి యునికార్న్‌ను నిర్మించడానికి రెండు ప్రయత్నాలు చేశారు. మరో ఆరుగురు మూడుసార్లు ప్రయత్నించారు.
జెప్టో ఫౌండర్లు అంతకుముందు కిరాణా కార్ట్‌ను నిర్వహించారు. 6.4 బిలియన్ డాలర్ల విలువైన ఫిన్‌టెక్ యునికార్న్ క్రెడ్‌ను ప్రారంభించే ముందు కునాల్ షా ప్రముఖంగా స్నాప్‌డీల్‌కు ఫ్రీచార్జ్‌ను అమ్మేశారు. డీల్‌షేర్‌ను స్థాపించడానికి ముందు వినీత్ రావు రెండు కంపెనీలను (స్పెక్ట్రావీఆర్, షాప్‌వెస్ట్)ను స్థాపించారు. ఓలా ఎలక్ట్రిక్, కృత్రిమ్, ఎక్స్‌ప్రెస్‌బీస్, గ్లాన్స్, గ్లోబల్బీస్ ఆక్సిజో వంటి 110 భారతీయ యునికార్న్‌లను స్టడీ చేసి ఈ రిపోర్టును ప్రైవేట్ సర్కిల్ రూపొందించింది.