
గచ్చిబౌలి, వెలుగు: కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలను సోషల్మీడియాలో పోస్టులు చేసిన కేసులో బీఆర్ఎస్సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్, డిజిటల్మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ ను గచ్చిబౌలి పోలీసులు విచారించారు. బుధవారం ఉదయం10.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇద్దరూ స్టేషన్లోనే ఉన్నారు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్తో కూడిన బృందం విచారించింది. అనంతరం క్రిశాంక్, దిలీప్మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు వంద తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. హెచ్సీయూలో నెమళ్లు, జింకలు ఉన్నది వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు.
రేవంత్రెడ్డి కూడా యూనివర్సిటీలో జింకలు లేవని పోస్టులు పెట్టారని, పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేశారా అని ప్రశ్నించారు. 10 వేల కోట్ల స్కాం బయటికి రాకుండా సీఎం డైవర్షన్పాలిటిక్స్చేస్తున్నారన్నారు. సెలవు రోజుల్లో కంచె గచ్చిబౌలి భూముల్లోని చెట్లను నరికి సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని ఆరోపించారు. విచారణ పేరిట ఉదయం 11 గంటల నుంచి స్టేషన్లోనే కుర్చొబెట్టారని, 7 గంటల పాటు ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు. పోలీసులు అడిగిన దాదాపు 60 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చామన్నారు. 14న విచారణకు రావాలని పోలీసులు చెప్పినట్లు తెలిపారు.