- రోడ్డు రోలర్స్ తో 60 సైలెన్సర్లు తొక్కించిన పోలీసులు
కామారెడ్డిటౌన్, వెలుగు: ఎక్కువ సౌండ్ వచ్చేలా బైక్ లకు బిగించుకున్న 60 సైలెన్సర్లను పోలీసులు రోడ్డు రోలర్ తో తొక్కించారు. డీఎస్పీ నాగేశ్వర రావు మాట్లాడుతూ.. వెహికల్స్ కు అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
బైక్ లు కొనుగోలు చేసినపుడు వచ్చే సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కౌన్సిలింగ్ ఇచ్చిన మార్పు కనిపించకపోవడంతో కామారెడ్డి టౌన్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి రోడ్డు రోలర్ తో సైలెన్సర్లను తొక్కించారు.