HYD: అల్వాల్‎లో 600 కిలోల కల్తీ పన్నీరు సీజ్

HYD: అల్వాల్‎లో 600 కిలోల కల్తీ పన్నీరు సీజ్

హైదరాబాద్: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఎంక్లేవ్‎లో భారీ మొత్తంలో నకిలీ పన్నీరు పట్టుబడింది. పక్క సమాచారంతో నకిలీ పన్నీరు తయారు కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. సుమారు 600 కిలోల పన్నీరును సీజ్ చేసిన ఎస్వోటీ పోలీసులు.. నిందితులను అల్వాల్ పోలీస్‎లకు అప్పగించారు. ఘటన స్థలం నుండి కల్తీ పన్నీరుతో పాటు రసాయనాలు కూడా లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు. 

బేగం బజార్‎కు చెందిన వ్యాపారి నకిలీ పన్నీరు వ్యాపారం నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఇటీవల హైదరాబాద్ నగరంలో కల్తీ ఘటనలు పెరిగిపోతున్నాయి. ధనార్జన కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆహార కల్తీ చేస్తున్నారు కొందరు వ్యాపారులు. ఇలాంటి వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుస సోదాలతో కల్తీరాయుళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు.   

ALSO READ | వైరస్ వార్తలతో.. స్టాక్ మార్కెట్ ఢమాల్.. 8 లక్షల కోట్ల సంపద ఆవిరి