బేగంపేటలో కుళ్లిన చికెన్​ 600 కిలోలు పట్టివేత

బేగంపేటలో కుళ్లిన చికెన్​ 600 కిలోలు పట్టివేత
  •  సిట్టింగ్ రూమ్స్​, బార్లు, కల్లు దుకాణాలకు సరఫరా 

హైదరాబాద్ సిటీ, వెలుగు : బేగంపేటలోని అన్నానగర్‌‌‌‌లో పలు చికెన్ సెంటర్లపై దాడులు చేసి 600 కేజీల కుళ్లిన చికెన్‌‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అర్జున్ నగర్‌‌‌‌లో భాస్కర్ అనే వ్యక్తి ఎస్ఎస్ఎస్ పేరుతో చికెన్ షాపు, అన్నానగర్‌‌‌‌లో రవి అనే వ్యక్తి తన పేరుతోనే మరో చికెన్ షాపు నిర్వహిస్తున్నారు. వీరు కుళ్లిన చికెన్‌‌కు కెమికల్స్, మసాలాలు, కారం, ఉప్పు కలిపి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచి, విక్రయిస్తున్నారని స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. 

దీంతో టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం ఆయా షాపులపై దాడులు నిర్వహించి, 600 కిలోల కుళ్లిన చికెన్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. చికెన్‌‌ను ఒక్కోసారి రెండు, మూడు నెలలు స్టోర్ చేసేవారన్నారు. దీనిని అతి తక్కువ ధరకు సిటీలోని బార్లు, కల్లు దుకాణాలు, వైన్ షాపుల వద్ద నిర్వహించే సిట్టింగ్ రూమ్స్‌‌కు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.