నల్లగొండ జిల్లాలో చిట్యాల వద్ద జాతీయ రహదారిపై టాస్క్ ఫోర్స్,సివిల్ సప్లయ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టుబడ్డాయి. ఓ లారీలో తర లిస్తున్న 600 బస్తాల పీడీఎస్ బియ్యం సీజ్ చేశారు అధికారులు.
లారీతోపాటు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. లారీలో అక్రమంగా విజయవాడనుంచి హైదరాబాద్ కు పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.