గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాల కోసం ఏర్పాట్లను అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. అన్ని ఏర్పాట్లను పోలీసులు, GHMC అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అటు స్పెషల్ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టకొని మంగళవారం 600 స్పెషల్ బస్సులు అందుబాటు ఉంచినట్లు గ్రేటర్ హైదరాబాద్ ఈడీ తెలిపారు. బషీర్ బాగ్, ఓల్డ్ MLA క్వార్టర్స్, లక్డీకపూల్, కూకట్ పల్లి, వనస్థలిపురం, లింగపల్లి, పటాన్ చెరు తో పాటు పలు ఏరియాల్లో స్పెషల్ బస్సులు నడవనున్నాయి.
ఇక ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, NTR మార్గ్ వైపు నిమజ్జనాలు జరగనున్నాయి. ఇక నిమజ్జనాలు చూసేందుకు వచ్చే భక్తుల కోసం RTC ఏర్పాట్లు చేసింది. ఖైరతాబాద్ బడా గణేష్ మంగళవారం మధ్యాహ్నంలోపే నిమజ్జనం జరగనుంది. బాలాపూర్, ఖైరాతాబాద్ గణేష నిమజ్జనాల కోసం ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
హైదరాబాద్ వ్యాప్తంగా 3 లక్షల వరకు వినాయక మండపాలు ఉన్నాయి. నిమజ్జనాల కోసం సిటీలో 73 పాండ్స్ తో పాటుగా 5 పెద్ద చెరువుల దగ్గర ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం కోసం 140 స్టాటిక్ క్రేన్స్, 295 మొబైల్ క్రేన్స్, 160 గణేష్ యాక్షన్ టీమ్స్ ను సిద్ధం చేసింది GHMC. మరోవైపు నిమజ్జనం రోజు 25వేల మంది పోలీసులు బందోబస్తులో చేపడతామని పోలీసులు ప్రకటించారు. హుస్సేన్ సాగర్ దగ్గర నిమజ్జనాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే నిన్న, ఇవాళ నిమజ్జనాల రద్దీ భారీగా పెరిగింది.