ముసలావిడే కానీ మహానుభావురాలు.. 60ఏళ్ల వయసులో ఇంత అందంతో.. మిస్ యూనివర్సస్

ఏజ్ ఈస్ ఏ జస్ట్ నెంబర్ అనే మాటని నిజం చేశారు ఓ అరవై ఏళ్ల మహిళ. అర్జెంటీనాకి చెందిన అలెజండ్రా మరిసా రోడ్రిగ్వెజ్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. 60 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనడమే కాకుండా ఆ టైటిల్‌నీ గెలుచుకుంది. అర్జెంటీనాలోని బ్యునెస్ ఎయిర్స్ లో జరిగిన ఈ అందాల పోటీల్లో ఆమె విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. వయసు 60 ఏళ్లే అయినా చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంది. ఇప్పటి వరకూ జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఇదే ఎంతో అరుదైందిగా చరిత్ర సృష్టించింది. 

ఇప్పుడు సోషల్ మీడియా అంతా అలెజండ్రా పేరు మారు మోగుతోంది. లా పల్టా నగరానికి చెందిన అలెజండ్రా ఓ జర్నలిస్ట్‌, న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఇదే సమయంలో అందాల పోటీపైనా దృష్టి పెట్టారు. ఈ వయసులో ఈ కిరీటాన్ని దక్కించుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెక్సికోలో  పోటీలు జరగనున్నాయి. అందులోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అలెజండ్రా మరిసా. గతేడాది మిస్ యూనివర్సస్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన చేసింది. ఇకపై ఈ పోటీల్లో పాల్గొనే వారికి ఎలాంటి వయసు పరిమితి విధించడం లేదని వెల్లడించింది. 18 ఏళ్లుపై బడిన వాళ్లు ఎవరైనా సరే కంటెస్ట్ చేయొచ్చని తెలిపింది. దీంతో అలెజండ్రా పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకూ ఈ కిరీటం దక్కించుకున్న వాళ్లలో 18-- 28 ఏళ్ల వయసున్న వాళ్లే ఉన్నారు.