
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం గ్రూప్ బి, గ్రూప్ సీ విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి మే నెలలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 19 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెaన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: గ్రూప్ -బికి రూ.200; గ్రూప్- సీకి రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు లేదు) మార్చి 19 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ర్యాలీ మే 1 నుంచి నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.assamrifles.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.