617 మంది పోలీసులకు పతకాలు

617 మంది పోలీసులకు పతకాలు
  •  
  • గ్రేహౌండ్స్‌ కమాండెంట్‌ రాకేశ్‌కు టీజీ శౌర్య పతకం
  • 17 మందికి మహోన్నత,460 మందికి సేవా పతకాలు
  • ప్రకటించిన స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ రవిగుప్తా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన 617 మంది పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. కొత్త ఏడాది పురస్కరించుకుని ఏటా అందించే పతకాలకు ఎంపిక చేసింది. తెలంగాణ శౌర్యపతకం, మహోన్నత సేవా పతకం, ఉత్తమ సేవా పతకం, కఠిన సేవా పతకం,సేవా పతకం కేటగిరీల జాబితాను హోంశాఖ స్పెషల్ చీఫ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం వెల్లడించారు. పోలీస్‌‌‌‌‌‌‌‌, స్పెషల్‌‌‌‌‌‌‌‌ ప్రొటెక్షన్​ ఫోర్స్‌‌‌‌‌‌‌‌, ఫైర్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌, యాంటీ కరప్షన్‌‌‌‌‌‌‌‌ బ్యూరో, విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ విభాగాల్లోని అధికారులు, సిబ్బందికి పతకాల ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

శాఖల వారీగా పతకాల వివరాలు

రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పతకమైన తెలంగాణ స్టేట్‌‌‌‌‌‌‌‌ శౌర్య పతకం గ్రేహౌండ్స్‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌ కమాండెంట్‌‌‌‌‌‌‌‌ టి.రాకేశ్‌‌‌‌‌‌‌‌కు దక్కింది. మహోన్నత సేవాపతకం 17 మందికి, ఉత్తమ సేవాపతకం 93, కఠిన సేవా పతకం 46, సేవా పతకం460 మందికి దక్కాయి. ఏసీబీలో మహోన్నత సేవాపతకం ఇద్దరికి, ఉత్తమ సేవాపతకం ముగ్గురికి, సేవా పతకం ఒక్కరికి దక్కాయి. విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ శాఖలో మహోన్నత సేవాపతకం ఒక్కరికి,  సేవ పతకం నలుగురికి దక్కాయి. తెలంగాణ స్పెషల్‌‌‌‌‌‌‌‌ ప్రొటెక్షన్​ ఫోర్స్‌‌‌‌‌‌‌‌లో మహోన్నత సేవా పతకం ఒక్కరికి, ఉత్తమ సేవా పతకం ముగ్గురికి, సేవా పతకం15 మందికి దక్కాయి.

అగ్నిమాపక శాఖలో ఐదుగురికి శౌర్య పతకాలు

అగ్నిమాపకశాఖలో పనిచేస్తున్న మెదక్‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌ లీడింగ్‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ పోచ నర్సయ్య, జహీరాబాద్‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ లీడింగ్‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ బి.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, పటాన్‌‌‌‌‌‌‌‌చెరు ఫైర్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌ డ్రైవర్‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌.శంకర్‌‌‌‌‌‌‌‌, సదాశివపేట్‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌.రవికుమార్‌‌‌‌‌‌‌‌, వికారాబాద్‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ పి.మధుసూదన్‌‌‌‌‌‌‌‌రావుకు తెలంగాణ స్టేట్‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ శౌర్య పతకాలు దక్కాయి. మహోన్నత సేవాపతకం ఒక్కరికి, ఉత్తమ సేవాపతకం ముగ్గురికి ,సేవ పతకం 14 మందికి వచ్చాయి.