హైదరాబాద్ జూపార్క్ 61వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ జూపార్క్  61వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్​ పార్క్​ ను దేశంలోనే టాప్​త్రీ జూపార్కుల్లో ఒకటిగా ప్రకటించడం చాలా గర్వంగా ఉందని పార్క్​ క్యూరేటర్, ఐఎఫ్ఎస్​ సునీల్ ఎస్ హిరేమత్​అన్నారు.​ అంతరించిపోతున్న ఆసియాటిక్ ​లయన్స్, రాయల్​ బెంగాల్​ టైగర్స్, వైట్​ టైగర్స్, ఒంటికొమ్ము ఖడ్గమృగం తదితర జంతువుల పెంపకంలో హైదరాబాద్​ జూ మైల్​ స్టోన్ ​చేరుకుందన్నారు. హైదరాబాద్ జూ 61వ ఆవిర్భావ దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని వినియోగించడంలో జూ పార్క్​ ముందుందన్నారు. 

ఆన్​లైన్ టికెట్ బుకింగ్​ సిస్టమ్, మొబైల్ యాప్​ తీసుకురావడంతోపాటు సోషల్ మీడియాలో జూపార్క్​ యాక్టివ్ గా ఉందని చెప్పారు. ‘వన్యప్రాణి వారం’లో భాగంగా డ్రాయింగ్, ఆటల పోటీల్లో గెలిచిన జూ ఉద్యోగులకు సర్టిఫికేట్స్,మెమోంటోలు అందజేశారు. తర్వాత జూపార్క్​మహిళా సిబ్బంది, సందర్శకులతో గోల్డెన్ ​జూబ్లీ పైలాన్ ​వద్ద బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో డిప్యూటీ క్యూరేటర్లు బర్నోబా, ఎంఏ హకీమ్, అసిస్టెంట్​క్యూరేటర్లు విష్ణువర్థన్, అమృతమ్మ, లక్ష్మణ్, డిప్యూటీ రేంజ్​ఆఫీసర్లు మాధవిలత, దేవేందర్​ దాసియా తదితరులు పాల్గొన్నారు. 

రూ.25 లక్షలు డొనేట్​చేసిన గ్లాండ్ ఫార్మాసూటికల్స్ 

జూపార్క్​లో 20 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న రివర్స్​ఓస్మోసిస్​ వాటర్ ​యూనిట్​ను ఏర్పాటు చేయడానికి సికింద్రాబాద్ బొల్లారం ప్రాంతానికి చెందిన గ్లాండ్​ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్​ ట్రస్టీ కెప్టెన్​ రఘురామ్​ రూ. 25 లక్షల చెక్కును సునీల్ హిరేమత్​కు అందజేశారు. గతేడాది కూడా జూపార్క్​ కు రోడ్​ ట్రైన్​ ను గ్లాండ్​ ఫార్మాసూటిక్స్​​ డొనేట్ చేసింది.