ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదైంది. ఉదయం 8:39 గంటల సమయంలో సమత్రా దీవుల్లోని పసమన్ బరత్ రీజెన్సీలో ప్రకంపనలు నమోదయ్యాయి. రీజెన్సీకి 17, బుక్కిటింగీకి 66 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు ప్రారంభమైనట్లు అధికారులు చెప్పారు. భూకంపం ధాటికి పక్కనే ఉన్న సింగపూర్, మలేషియాల్లో సైతం బిల్డింగ్లు కదిలిపోయాయి. సునామీ వచ్చే ప్రమాదం లేదని అధికారులు చెప్పారు.
Notable quake, preliminary info: M 6.2 - 66 km NNW of Bukittinggi, Indonesia https://t.co/BM6t3IttsJ
— USGS Earthquakes (@USGS_Quakes) February 25, 2022