ప్రభుత్వ పాలిటెక్నిక్‍లలో 62 శాతం సీట్ల భర్తీ

విజయవాడ : తుది దశ కౌన్సిలింగ్ ముగిసిన తరువాత రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రవేటు కళాశాలల్లో 46 శాతం కన్వీనర్ కోటా సీట్టు భర్తీ అయ్యాయని సాంకతిక విద్యా శాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య తెలిపారు. మొత్తం 262 విద్యా సంస్ధలలో 81,420 సీట్లు ఉండగా, 37,036 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. 88 ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో 17,943 సీట్లు ఉండగా, 62 శాతం మేర 11,042 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. ప్రవేటు సంస్ధల పరంగా 174 పాలిటెక్నిక్ లలో 63,477 సీట్లు ఉండగా, 41 శాతం మేర 37,483 సీట్లు భర్తీ చేసామని కన్వీనర్ తెలిపారు. 

పాలిసెట్ 2024లో అర్హత పొందిన అభ్యర్థుల సంఖ్య  1,24,430 కాగా, చివరి దశలో 2,307 మంది అభ్యర్థుల నమోదు చేసుకున్నారు. చివరి దశ వరకు నమోదు చేసుకున్న మొత్తం అభ్యర్థులు 43,618 మంది కాగా, వారిలో 41,390 అభ్యర్థులు అర్హత సాధించారు. చివరి దశలో ఎంపికలను 13,080 అభ్యర్థులు సద్వినియోగం చేసుకున్నారు. 

తుదిదశలో తాజా అడ్మిషన్ల సంఖ్య  6,780గా నమోదైందన్నారు. ఇప్పటికే తరగతులు ప్రారంభం అయినందున చివరి దశలో సీట్లు పొందిన విద్యార్దులు గురువారం నుండి జులై 20వ తేదీ లోపు అయా కళాశాలల్లో ఆన్ లైన్ లో వ్యక్తిగత రిపోర్టింగ్, కళాశాలలో రిపోర్టింగ్ రెండింటినీ పూర్తి చేయవలసి ఉందని డాక్టర్ బి నవ్య వివరించారు.